‘పోలీస్ అక్క’కు స్కోచ్ అవార్డు.. నిర్మల్ పోలీసులకు గర్వకారణం: డీఐజీ

క‌లం, వెబ్ డెస్క్‌: బాసర జోన్–2 డీఐజీ ఆర్. భాస్కరన్ (DIG Bhaskaran) శనివారం తొలిసారి నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల డీఐజీకి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న ‘పోలీస్ అక్క’, ‘నారీ శక్తి’, ‘శివంగి టీమ్’, ‘గంజా గస్తీ’ వంటి వినూత్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ జానకి షర్మిల డీఐజీకి వివరించారు. ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>