కుబీర్ మండలంలో చిరుత సంచారం.. ఆవుపై దాడితో కలవరం!

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా కుబీర్ మండలంలోని దోడర్న గ్రామ శివారు ప్రాంతంలో చిరుత (Leopard) దాడిలో ఓ ఆవు మృతి చెందింది. రైతు ఉత్తమ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మేతకు వెళ్లిన ఆవు సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో గాలించారు. అనంతరం శనివారం పొదల సమీపంలో ఆవు మృతదేహాన్ని గుర్తించారు.

ఆవు శరీరంపై చిరుత దాడికి సంబంధించిన గాయాలు కనిపించడంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. చిరుత సంచారంపై స్థానిక గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>