యాదాద్రి భక్తులకు ముఖ్య గమనిక.. పూజా వేళల్లో భారీ మార్పులు!

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో (Yadadri Temple) పూజా కార్యక్రమాలు, ఆర్జిత సేవల నిర్వహణకు సంబంధించి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్ 1, 2026 నుంచి నూతన సమయ పట్టికను అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 24న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తెల్లవారుజామునే ప్రారంభం!

ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. 3 నుంచి 3.30 గంటల వరకు సుప్రభాతం, 3.30 నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన, 4 నుంచి 4.45 గంటల వరకు బాలభోగం నిర్వహించనున్నారు. అనంతరం 4.45 నుంచి 5.45 గంటల వరకు స్వామివారి నిజాభిషేకం జరగనుంది. 5.45 నుంచి 6.30 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆండాళమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించనున్నారు. 6.30 నుంచి 6.45 గంటల వరకు ధూపాల సేవ ఉంటుంది.

గిరి ప్రదక్షిణ భక్తులకు ప్రత్యేక దర్శనం!

ఉదయం 6.45 నుంచి 8.30 గంటల వరకు గిరి ప్రదక్షిణ నిర్వహించిన అయ్యప్ప స్వాములకు గరుడాలయ దర్శనం కల్పించనున్నారు. ఇదే సమయంలో ప్రతి మంగళవారం కల్యాణం స్థానిక ప్రజలకు దర్శనం అనుమతించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు సర్వదర్శనాలు, 9.30 నుంచి 10.30 గంటల వరకు బ్రేక్ దర్శనం నిర్వహించనున్నారు. తదుపరి ఉదయపు ఆర్జిత దర్శనాలు, ఆలయ పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

భక్తులు ముందుగానే తెలుసుకోవాల్సిన మార్పులు!

యాదాద్రి క్షేత్రానికి (Yadadri Temple) తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పూజలు, ఆర్జిత సేవల సమయాల్లో మార్పులు భక్తులకు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా నిజాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి సేవల్లో పాల్గొనాలనుకునే వారు నూతన సమయ పట్టికను ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. యాదాద్రి క్షేత్రానికి వెళ్లే ముందు కొత్త సమయాలను తెలుసుకొని.. పూజా వేళలను గమనించి దర్శన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.

Also Read : ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. 11 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>