ఫీజు రీయింబర్స్​మెంట్ రద్దుకు ప్రభుత్వం కుట్ర : జాజుల శ్రీనివాస్​ గౌడ్​

కలం, వెబ్​ డెస్క్​ : ఫీజు రీయింబర్స్​మెంట్ (Fee Reimbursement)​ పథాకాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్​లోని బీసీ జేఏసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి నేటి కాంగ్రెస్ పార్టీలు ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల విషయంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలోనే తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్యే సీటు నుండి మొదలుకొని సీఎం సీటు వరకు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఏలుతున్నారన్నారని ఆరోపించారు. బీసీలకు కనీసం చదువుకోడానికి కూడా అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఐదు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్​మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల చేయకపోవడంతో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వేలాదిమంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని గొప్పలు చెప్పుకుంటూనే, ఇంకొక వైపు ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందన్నారు. బకాయిల చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు గుదిబండలా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని జాజుల డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నా మౌనంగా చూస్తూ కూర్చున్న బీసీ మంత్రులు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. బీసీల ప్రయోజనాలకు పాటుపడని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని బీసీ మంత్రులకు ఆయన సూచించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని రక్షించుకోవడం కోసం బీసీ సమాజం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బండిగారి రాజు, ఆవుల నరేష్, నరసమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఫ్లేమ్ లెస్ కిచెన్​ : మంట లేకుండానే 1500 మందికి వంట

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>