బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ధురందర్ 2.. 2 రోజులకే 200 కోట్ల షేర్

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ (Bollywood) హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బాలీవుడ్ వర్గాల ప్రకారం.. శుక్రవారం ఈ సినిమా రూ. 80.72 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. పెయిడ్ ప్రివ్యూలతో కలిపి, రెండు రోజుల్లోనే భారత్‌లో మొత్తం రూ. 226.27 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తన జోరును కొనసాగిస్తూ మొదటి వీకెండ్ ముగిసే సమయానికి రూ. 500 కోట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో మొత్తం 20,125 షోలతో భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 269.39 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో 63 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, దక్షిణాదిలో భారీ స్థాయిలో డబ్బింగ్ వెర్షన్లు విడుదల కాకపోవడంతో అక్కడ వసూళ్లు ఆశాజనకంగా లేవు. రెండో రోజున తమిళంలో రూ. 24 కోట్లు, తెలుగులో రూ. 76 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.

ఈద్ సెలవుల సీజన్‌ ఉండటంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్‌లో ప్రతిరోజూ రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే దిశగా సినిమా దూసుకుపోతోంది. ఇదే వేగం కొనసాగితే, వీకెండ్ ముగిసేసరికి దేశవ్యాప్తంగా (Dhurandhar 2) రూ. 450 నుండి 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>