కలం, వెబ్ డెస్క్: జూన్ 20న రాష్ట్ర వ్యాప్తంగా రెండో జాతీయ లోక్ అదాలత్ జరగబోతున్న సందర్భంగా డీజీసీ సీవీ.ఆనంద్ (DGP CV Anand) సమీక్ష చేశారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ సంస్థ (TSLSA), పోలీ శాఖ మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. అదాలత్‌లో పరస్పర రాజీ ద్వారా పరిష్కరించదగిన క్రిమినల్ కేసుల సెటిల్‌మెంట్, అదాలత్‌కు సిఫార్సు చేయదగిన కేసులపై చర్చించారు. కక్షిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. అంతేగాకుండా కక్షిదారులకు విలువైన సమయం, డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. న్యాయస్థానాలపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

