కాంగ్రెస్ లో ఎవరైనా కోవర్టులు ఉంటే తోలు తీస్తాం: జగ్గారెడ్డి

కలం, వెబ్ డెస్క్ : రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరణకు గురికావడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నారే ఆరోపణలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ లో ఎవరైనా కోవర్టులు ఉంటే తోలు తీస్తామని వెల్లడించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండకూడదని బీజేపీ కుట్రలు చేస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. మీనాక్షి రాజ్యసభ సభ్యురాలు కాకుండా బీజేపీ సీటు చోరీ చేసిందని ఆరోపించారు. నమోదు కాని ప్రైవేట్ కేసును అడ్డుపెట్టుకుని నామినేషన్‌ను తిరస్కరించడం ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అయితే బీజేపీ సీట్ చోరీపై చర్చ జరగకుండా కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారనే ప్రచారం జరుపుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>