పీజీటీఐ నెక్స్ట్‌జెన్ గోల్ఫ్ టోర్నీ విజేతగా సునీత్ చౌరాసియా

క‌లం, వెబ్ డెస్క్: కోల్‌కతా గోల్ఫర్ సునీత్ చౌరాసియా (Sunhit Chaurasia) అద్భుత ఫామ్‌లో ఉన్నారు. లక్నో (Lucknow)లో జరిగిన పీజీటీఐ నెక్స్ట్‌జెన్ విజయ్ కుమార్ మెమోరియల్ టోర్నీలో ఆయన విజేతగా నిలిచారు. రూ. 25 లక్షల ప్రైజ్ మనీ గల ఈ పోటీలో సునీత్ తొమ్మిది అండర్ 201 స్కోరు సాధించారు. మూడు షాట్ల తేడాతో ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ గెలుపుతో ఆయనకు రూ. 3,17,875 ప్రైజ్ మనీ దక్కింది. అలాగే ఈ సీజన్ మెరిట్ జాబితాలో సునీత్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. ప్రముఖ గోల్ఫర్ ఎస్‌ఎస్‌పీ చౌరాసియాకు సునీత్ వారసుడు కావడం విశేషం.

సునీత్‌కు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో విజయం. అంతకుముందు మార్చిలో పాట్నా టోర్నీలోనూ ఆయనే గెలిచారు. లక్నో మ్యాచ్ చివరి రౌండ్‌లో కొంత ఒత్తిడి ఎదురైనా సునీత్ ఓపికగా ఆడారు. మూడేళ్ల క్రితం ఆయన గాయాలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కోలుకుని వరుసగా రెండు టైటిళ్లు గెలవడంపై సునీత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విజయంపై మొరాకో నుంచి బాబాయ్ ఎస్‌ఎస్‌పీ చౌరాసియా ఫోన్ చేసి అభినందించారు.

ఈ పోటీలో ఢిల్లీకి చెందిన పవన్ కుమార్ రన్నరప్‌గా నిలిచారు. లక్నో లోకల్ ప్లేయర్ రాజేష్ కుమార్ గౌతమ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన అజయ్ బైసోయా నాల్గో స్థానంలో, వసీం ఖాన్ ఐదో స్థానంలో నిలిచారు. భారతదేశంలో గోల్ఫ్ క్రీడను చిన్న నగరాలకు విస్తరించడానికి ఈ టోర్నీలు ఉపయోగపడుతున్నాయి. పీజీటీఐ తదుపరి పోటీ జూన్ 16 నుండి వారణాసిలో ప్రారంభం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>