epaper
Wednesday, February 18, 2026
epaper

చార్​ ధామ్​ యాత్రకు ఈసారి రిజిస్ట్రేషన్​ ఫీజు

కలం, వెబ్​ డెస్క్​: హిందువులకు ఎంతో పవిత్రమైన చార్​ ధామ్​ యాత్ర (Char Dham Yatra 2026) ఈ ఏడాది ఏప్రిల్​ 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్. ఈసారి యాత్ర రిజిస్ట్రేషన్​కు ఫీజు వసూలు చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. ఫీజు ఎంత మేర ఉంటుందనేది త్వరలోనే చెబుతామన్నారు.

యాత్ర నిర్వహణపై రుషికేశ్​లో గర్వాల్​ కమిషనర్​ వినయ్​ శంకర్​ పాండే అధ్యక్షతన సమావేశం జరిగింది. యాత్ర సాఫీగా, భద్రంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఈసారి రిజిస్ట్రేషన్​ ఫీజు వసూలు చేయాలని తీర్మానించారు. కాగా, ఈ సీజన్‌లో భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని పాండే తెలిపారు. అయితే ప్రతి యాత్రికుడూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకే ఈసారి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఉత్తరాఖండ్​లోని మంచుపర్వతాల్లో ఉండే గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​ క్షేత్రాలను కలిపి చార్​ ధామ్​గా వ్యవహరిస్తారు (Char Dham Yatra 2026). అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఈ పవిత్ర స్థలాలకు చేరుకుని, దైవ దర్శనం చేసుకోవడం కోసం ఏటా వేలాది మంది వెళుతుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>