epaper
Wednesday, February 18, 2026
epaper

వారణాసి తర్వాత ఆ డైరెక్టర్‌తో మహేశ్‌బాబు మూవీ..?

కలం, డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ గా కొనసాగుతోంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే జూన్ నాటికి కంప్లీట్ కాబోతోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. అయితే వారణాసి ఒకవేళ పెద్ద హిట్ అయితే మహేశ్ బాబుకు పాన్ వరల్డ్ క్రేజ్ రావడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. అప్పుడు ఎవరితో మూవీ చేస్తారనే చర్చ ఇప్పటి నుంచే జరుగుతోంది.

ప్రస్తుతానికి మహేశ్ బాబు (Mahesh Babu) కొత్త మూవీపై ఫోకస్ పెట్టట్లేదని తెలుస్తోంది. రాజమౌళితో వారణాసి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతనే కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబుతో మూవీ చేయడానికి హోంబలే సంస్థ, సన్ పిక్చర్స్ రెడీగా ఉన్నాయి. ఈ రెండు సంస్థలు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే.

అయితే సందీప్ రెడ్డి వంగాతో మూవీ ఉంటుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. గతంలో మహేశ్ కు డెవిల్ అనే స్క్రిప్ట్ వినిపించాడు సందీప్. యానిమల్ కంటే చాలా వైలెంట్ గా ఉంటుందంట ఆ మూవీ. కానీ కొన్ని కారణాలతో అది ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు ఆ స్క్రిప్టుతో మహేశ్ మూవీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

కొరటాల శివ, ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి లాంటి వాళ్లు కూడా మహేశ్ లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కూడా ఇప్పటికే కొన్ని కథలు మహేశ్ కు వినిపించారంట. కానీ వాటన్నింటినీ మహేశ్ ఇప్పుడు పక్కన పెట్టారని.. త్వరలోనే వాటిపై మళ్లీ చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఏ డైరెరక్టర్ తో బాబు మూవీ ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>