ప్రమాదవశాత్తు గోదారిలో పడ్డ భక్తుడు.. కాపాడిన డీడీఆర్ఎఫ్ బృందం

కలం, ఖమ్మం బ్యూరో : శ్రీరామ నవమి వేళ భద్రాచలం (Bhadrachalam) తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు చూడడానికి హైద్రాబాద్ నుంచి వచ్చిన ఉదయ్ అనే భక్తుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే విధులలో ఉన్న డీడీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక ఈతగాళ్లు వెంటనే స్పందించి యువకుడిని రక్షించి ఆంబులెన్స్ లో హాస్పటల్ కి చేరవేశారు. ఆపదలో ఉన్న వారిని సంరక్షించడానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన డీడీఆర్ఎఫ్ బృందం వ్యక్తి ప్రాణాలను కాపాడటంతో స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. యువకుడి ప్రాణాలను కాపాడిన బృంద సభ్యులైన ఆర్ఎస్ఐ సుమంత్, కానిస్టేబుల్స్​ రమేష్, వినోద్ కుమార్, రాజేష్, ఫరీద్ బాబు, జమలయ్య, సాయి ఫణింద్ర, అనిల్ కుమార్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>