తాగునీటి సమస్య పరిష్కరించండి: ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) రాష్ట్ర మంత్రులను కోరారు. నల్లగొండలో జరిగిన ‘ఎల్‌-నినో ప్రభావం-సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం’ అనే అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు.

ఇవి రెండు పూర్తయితే..

నియోజకవర్గ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) విజ్ఞప్తి చేశారు. పెండ్లిపాకల 7 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఇటీవల మరమ్మతులు చేసిన 33/415 ట్రాన్స్‌ఫార్మర్‌కు తోడుగా, అదనంగా కొత్త ది ఏర్పాటు చేయాలని కోరారు.

బాట్లపల్లి పంప్‌హౌస్‌లో (Batlapalli Pumphouse) అదనపు మోటార్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రతిపాదనలు అమలైతే భవిష్యత్తులో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆయన వివరించారు.

ఎమ్మెల్యే వినతికి మంత్రి స్పందన..

డిండి ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సాగునీటిని విడుదల చేసినందున, ప్రస్తుతం ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు ఉన్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. వానాకాలం పంటలకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.

మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Read Also: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>