ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసినట్లుగా ఓ సూసైడ్ నోట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. సూసైట్ నోట్‌లో తన ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలను వివరిస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు.

ఏడాదిగా రిలేషన్.. రూమ్‌కి వచ్చి మరీ!

సదరు సూసైడ్ నోట్ ప్రకారం.. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో తాను ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) వెల్లడించారు. సదరు మహిళా ఆఫీసర్‌కు అంతకుముందే పెళ్లి జరిగినప్పటికీ.. ఆమె తనతో సంబంధాన్ని కొనసాగించిందని తెలిపారు. అంతేకాదు ఆమె తన రూమ్‌కు వచ్చి డోర్ ఓపెన్ చేయమని అడిగేదని, దీనికి సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

భర్తకు కూడా చెప్పా..

తమ మధ్య ఉన్న రిలేషన్‌ను సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా స్వయంగా తెలియజేశానని ఉదయ్ కృష్ణారెడ్డి తన నోట్‌లో పేర్కొన్నారు. అలాగే  తన ఆత్మహత్య ప్రయత్నానికి నలుగురు వ్యక్తులు ముఖ్య కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. దీంతో ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ఉన్న ఆ నలుగురు ఎవరు? ఆ వీడియో ఆధారాల్లో ఏముంది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>