Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌ళ్లీ గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు టీవీకే విజ‌య్‌…!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu) ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారితే.. ఇప్పుడు రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో నెల‌కొన్న‌ అనిశ్చితి నేప‌థ్యంలో టీవీకే అధినేత విజ‌య్ (TVK Vijay) గ‌వ‌ర్న‌ర్‌తో వ‌రుస స‌మావేశాలు కావ‌డం హాట్ టాపిగ్‌గా మారింది. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఇప్ప‌టికే రెండు సార్లు గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయిన విజ‌య్ తాజాగా నేడు సాయంత్రం మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ కోరారు.

స‌రిగా 4:30 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అరేక‌ర్‌తో విజ‌య్ భేటీ కానున్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకై ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కోసం విజ‌య్ (TVK Vijay) విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. ఆయ‌న‌కు మూడు పార్టీల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తును గ‌వ‌ర్న‌ర్‌కు చూపించేందుకు విజ‌య్ ఈ అపాయింట్‌మెంట్ కోరిన‌ట్లు తెలుస్తోంది.

Read Also: ఖమ్మం కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు..!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>