Mobile Popup Ad
Mobile Popup Ad

2029లో బీఆర్‌ఎస్‌ ఎలా గెలుస్తుందో చూస్తా : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth) బీఆర్ ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. 2029 ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఎలా గెలుస్తుందో తాను చూస్తానన్నారు. తనను గతంలో బరాబార్ అని మాట్లాడినందుకే తొక్కుకుంటూ వచ్చి సీఎం అయ్యానని.. ఎవరినీ దేహి అని అడుక్కుంటూ రాలేదన్నారు సీఎం రేవంత్ (Revanth). ఇప్పటికీ బీఆర్ ఎస్ నేతలకు బుద్ధి రావట్లేదని.. ఇలాగే బరాబర్ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడితే.. 2029లో మళ్లీ తొక్కేస్తానంటూ రేవంత్ చెప్పారు.

అప్పట్లో చంద్రబాబు దయవల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని.. పొత్తులో భాగంగానే ఉద్యమ సమయంలో కేసీఆర్ ను తాము కష్టపడి పాలమూరులో ఎంపీగా గెలిపించామన్నారు సీఎం రేవంత్. కానీ కేసీఆర్ కు కనీస కృతజ్ఞత అనేది లేదన్నారు. అడ్డదిడ్డంగా గెలిచిన చరిత్ర బీఆర్ ఎస్ ది అని.. తండ్రుల పేరు చెప్పుకుని గెలిచిన వ్యక్తి కేటీఆర్ అన్నారు. తాను స్వశక్తితో ఎదిగి గెలిచానని.. తన కాలి గోటికి కూడా బీఆర్ ఎస్ నేతలు సరిపోరంటూ రేవంత్ సంచలన కామెంట్లు చేశారు. తాను ఎవరి అండ లేకుండా ఎదిగానని.. ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్ తో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని రేవంత్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>