Mobile Popup Ad
Mobile Popup Ad

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కలం, నల్లగొండ బ్యూరో: కార్మికుల హక్కులు, సంక్షేమ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలకు భ‌ట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు, అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ మే 1న మే డే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, 145 సంవత్సరాలకు పూర్వం చికాగో నగరంలో కార్మికులు 8 గంటలు పని చేయాలని కోరుతూ ఉద్యమించారన్నారు. ఆ సందర్భంలో కార్మికులపై చేసిన దాడిలో రక్తం చిందిన సందర్భాలకు గుర్తుగా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని తెలిపారు.

భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కార్మికులు అణగారిన వర్గాల వారి హక్కుల రక్షణ, అభివృద్ధికి కృషి చేశారని, కార్మికుల సంక్షేమంపై వారి హక్కుల గురించి బ్రిటిష్ పరిపాలనలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. భారత దేశంలో సైతం కార్మికులు 8 గంటల పని చేసేలా కౌన్సిల్ వద్ద పోరాటం చేశారని భట్టి (Deputy CM Bhatti) తెలిపారు. పురుష కార్మికులతో పాటు మహిళలకు కూడా మొట్టమొదటిసారిగా మెటర్నటీ లీవ్ ను ఏర్పాటు రాజ్యాంగం ద్వారా పొందుపరిచారని, అలాగే ఇంట్లో పని చేసే వారికి కూడా మెటర్నరీ లీవ్ ఇచ్చే విధంగా హక్కులు కల్పించారని తెలిపారు. స్వాతంత్రం రాకముందు వైస్రాయ్ కౌన్సిల్‌లో హిందూ కోడ్ బిల్ పొందుపరిచేందుకు పోరాటం చేశారని, 1955 హిందూ వివాహ చట్టం, 1956 హిందూ వారసత్వ చట్టం ద్వారానే మహిళలకు హక్కులతో పాటు వివాహ హక్కు, ఆస్తి హక్కు వంటివి కల్పించబడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Read Also: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>