నిర్మల్‌లో KGBV ప్రవేశ పరీక్షలు.. కేంద్రాన్ని తనిఖీ చేసిన DEO

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి (Nirmal DEO) దర్శన్ భోజన్న (Darshan Bhojanna) పరిశీలించారు. నిర్మల్ పట్టణంలోని అర్బన్ KGBV పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును తనిఖీ చేశారు.

అనంతరం DEO మాట్లాడుతూ.. KGBV లలో ఆరో తరగతి ప్రవేశాలు పూర్తిగా ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే కల్పిస్తామని తెలిపారు. పారదర్శకంగా ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ తనిఖీలో పరీక్షల నిర్వాహకులు పరమేశ్వర్, ఎస్‌ఓ సుజాత పాల్గొన్నారు.

Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>