epaper
Monday, February 2, 2026
spot_img
epaper

లిఫ్ట్​ నిరాకరణ.. భారీ పార్సిల్​ తో 6 అంతస్తులెక్కిన డెలివరీ ఏజెంట్​

కలం, వెబ్​ డెస్క్​ : సమాజంలో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతుంది. ఎవరెలాపోతే మనకేంటి అనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. పనివాళ్లపై కనీసం దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో చర్చకు దారితీసింది. పార్సిల్ అందజేయడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ కి అపార్డుమెంట్​ వాళ్లు లిఫ్ట్​ ఎక్కనివ్వకుండా నిరాకరించారు (Lift Denial). దీంతో చేసేదేమీ లేక.. వెనకడుగు వేయకుండా 6 అంతస్తులు మెట్లగుండా ఎక్కాడు.. అది కూడా భారీ సైజులో ఉన్న పార్సిల్ ఎత్తుకుని. డెలివరీ ఏజెంట్​ మెట్లెక్కుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి అమానవీయం అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. డెలివరీ ఏజెంట్ పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు.

Read Also: పాక్​ను బెంబేలెత్తిస్తున్న బలూచ్​ ఆత్మాహుతి దళం మహిళలు

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>