కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో భాగంగా కేసీఆర్‌ను (KCR) ఎవరూ ఈడ్చుకుని రాలేదని, తలుపులు బద్దలు కొట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చారు, రావాలని కోరారు.. వయసు ఎక్కువగా ఉంది కాబట్టి మీరే రావాలని, అదికూడా అధికారిక నివాసంలోనే అని పోలీసులు చెప్పారన్నారు. కానీ ఫామ్ హౌస్ వచ్చి, బాత్‌రూమ్‌కు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలని కేసీఆర్ షరతులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఇదేమి జాతిపిత విధానం? ఇదేమి ఉద్యమకారుల విధానం? అంటూ రేవంత్ ప్రశ్నించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసం కొట్లాడిన చెగువేరా నుంచి రావి నారాయణరెడ్డి (Ravi Narayana Reddy) వరకు సర్వం కోల్పోయారని రేవంత్ అన్నారు. కుటుంబానికి నిలువనీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచి ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వీరిని ఉద్యమకారులు అని, జాతిపిత అని అనలేదు అని తెలిపారు. మరి ఇక్కడ మాత్రం పదవులన్నీ వారికే, ఫామ్ హౌస్‌లు వీరికే.. టీవీలు, పేపర్లు, వేల కోట్ల వ్యాపారాలు వారికే వచ్చాయి. కాంట్రాక్టులను పంచుకున్నారు. వీరేమి ఉద్యమకారులు? వీరేమి జాతిపితలు? అంటూ కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో క్రిమినల్ కాన్‌స్పిరసీకి స్వేచ్ఛ లేదని, ప్రజల హక్కులకు మాత్రమే స్వేచ్ఛ ఉన్నదని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాస్వామ్య పరిధికి లోబడి అభిప్రాయాలను వెల్లడించడానికే స్వేచ్ఛ ఉన్నది. నేరాలు చేసినా అడగవద్దు అని కోరడమేమిటి? క్రిమినల్ ఫ్రీడమ్‌కు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు సంపాదించుకుని అక్రమ మార్గంలో ఉంచుకున్నప్పుడు విచారణ ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఇది తప్పదని, రాజ్యాంగం ఇచ్చింది ఇదేనని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ : కేసీఆర్ పై రేవంత్ సంచలన కామెంట్స్
Follow Us On: X(Twitter)


