Mobile Popup Ad
Mobile Popup Ad

దక్షిణాది రాష్ట్రాల సీట్లపై అమిత్ షా క్లారిటీ.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

కలం, వెబ్ డెస్క్ : లోక్ సభలో డీలిమిటేషన్ (Delimitation) బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వివరణ ఇచ్చారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డీలిమిటేషన్ వల్ల ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు 130 నుంచి 195కి పెరుగుతాయని అమిత్ షా వెల్లడించారు.

డీలిమిటేషన్ (Delimitation) తో  దేశవ్యాప్తంగా ఏక రీతిన అన్ని రాష్ట్రాల్లో 50శాతం మేర సీట్లు పెరుగుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో లోక్ సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతుందని చెప్పారు. తెలంగాణలో లోక్ సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కి పెరుగుతుందన్నారు. తమిళనాడులో లోక్ సభ స్థానాలు 39 నుంచి 59కి పెరుగుతాయన్న అమిత్ షా… కర్నాటకలో లోక్ సభ సీట్లు 28 నుంచి 42 కి పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని, దీనితో ఎవరికీ నష్టం ఉండదని అమిత్ షా చెప్పుకొచ్చారు.

Read Also: రిటైర్మెంట్ కాదు.. రీఎంట్రీకి సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>