కలం, వెబ్ డెస్క్: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ కాకిరాల హరి ప్రసాదరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి ఝాన్సీ రెడ్డి పౌరసత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె భారత పౌరసత్వం లేకుండా ఇక్కడ రాజకీయ పదవులను అనుభవిస్తున్నారని సదరు నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కాకుండా తనకంటూ ఒక వర్గాన్ని ఝాన్సీ రెడ్డి తయారు చేసుకున్నారని పేర్కొన్నారు.
అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కోసం పని చేసే కార్యకర్తలపై ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) దాడులు చేయిస్తున్నారని చెప్తున్నారు. గత సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కాకుండా వేరే పార్టీ అభ్యర్థులను నియమించి పార్టీ కోసం కష్టపడిన వారికి ఝాన్సీ రెడ్డి ద్రోహం చేశారన్నారు. పోలీసు వ్యవస్థను వాడుకొని కాంగ్రెస్ క్యాడర్‌పై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. రమావత్ మధు అరెస్ట్
Follow Us On: Instagram

