epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీలో భారీ డిజిటల్ మోసం.. 10 మంది అరెస్ట్

కలం, వెబ్‌డెస్క్: డిజిటల్ మోసాలు (digital fraud), ఆన్ లైన్ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఢిల్లీ(Delhi) సౌత్ ఈస్ట్ జిల్లా డీసీపీ హేమంత్ తివారీ ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఓ ముఠా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డిజిటల్ మోసాలకు పాల్పడుతోంది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌తో దోచుకుంటోంది. నకిలీ అకౌంట్లు సృష్టించడం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఫేక్ వీడియోలు, ఫొటోలతో ఈ ముఠా బెదిరిస్తోంది.

దీంతో పోలీసులు ఢిల్లీ, ముంబై (మహారాష్ట్ర), కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఒకేసారి విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా డిజిటల్ మోసాల (digital fraud) వల్ల దేశవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా డిజిటల్ మోసం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ మోసాల ద్వారా వచ్చిన డబ్బును ముఠా సభ్యులు వివిధ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వాలెట్లు, క్రిప్టోకరెన్సీల ద్వారా అంతర్జాతీయంగా తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో భారీ మొత్తంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులు, బ్యాంక్ డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, డబ్బు లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు.

Read Also: వచ్చేశాయ్ AI జిమ్స్.. క్యాలరీలు కరిగించేద్దాం ఎంచక్కా!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>