కలం, వెబ్ డెస్క్: నీట్ (NEET) పరీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించిన టెలీగ్రామ్ (Telegram)కు ఎదురుదెబ్బ తగిలింది. టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్ట్ తిరస్కరించింది. ప్రభుత్వ ఉత్తర్వులు సముచితంగానే ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఐటీ చట్టం సెక్షన్ 69ఏ ప్రకారం ఒక ప్లాట్‌ఫామ్‌ను నిషేధించవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత ఉందని, టెలిగ్రామ్‌పై ఆంక్షలు సరైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 21న నీట్ పరీక్ష జరుగనుంది. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

