అమెరికా క్రికెటర్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ నిషేధం!

కలం, స్పోర్ట్స్: అమెరికా క్రికెటర్ బొడుగుం అఖిలేష్ రెడ్డి (Bodugum Akhilesh Reddy)పై ఐసీసీ భారీ వేటు వేసింది. అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిని ఎనిమిదేళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించింది. ఈ మేరకు ఐసీసీ ట్రిబ్యునల్ ఈ రోజు అధికారికంగా నిర్ణయం వెల్లడించింది. 2025 అబుదాబి టీ10 లీగ్‌లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతడిని దోషిగా తేల్చారు. అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన 2025 నవంబర్ 21 నుంచే ఈ నిషేధం అమలులోకి వస్తుంది.

అదనంగా పరుగులు ఇవ్వాలని..

2025 నవంబర్ 19న ఉదయం ఆస్పిన్ స్టాలియన్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు హోటల్ గదిలో ఒక ఘటన జరిగింది. మ్యాచ్‌లో అదనంగా పరుగులు ఇవ్వాలని అఖిలేష్ తన సహచర ఆటగాడిని కోరాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకే తాను ఈ పనిచేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఆ సహచర ఆటగాడు ఈ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించి.. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆగ్రహించిన జట్టు మేనేజ్‌మెంట్ ఆ మ్యాచ్ నుంచి అతడిని తొలగించింది.

ఆధారాలు తుడిచి వేసేందుకు..

విచారణ సమయంలో అఖిలేష్ తన వాట్సాప్ మెసేజ్‌లు, కాల్ హిస్టరీని డిలీట్ చేశాడు. డేటా క్లీన్ చేసుకోవడానికే ఇలా చేశానని అతడు సమర్థించుకున్నాడు. కానీ ఆధారాలను తుడిచేయడానికే అతడు ఈ పనిచేసినట్లు మైఖేల్ బెలాఫ్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ నిర్ధారించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నం చేయడం, ఇతరులను ప్రోత్సహించడం, ఆధారాలు ధ్వంసం చేయడం అనే మూడు ప్రధాన నేరాల కింద అతడిని దోషిగా నిర్ధారించారు. దీంతో ఐసీసీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>