సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్ట్ బిగ్‌ షాక్!

క‌లం, వెబ్‌డెస్క్: పౌర‌స‌త్వం కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి ఢిల్లీ హైకోర్ట్ షాకిచ్చింది. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. సోనియా గాంధీ భార‌త పౌర‌స‌త్వం పొందేందుకు ముందే ఆమె పేరు ఎన్నిక‌ల జాబితాలో ఉంద‌ని గ‌తంలో అడ్వకేట్ వికాస్ త్రిపాఠి ఫిర్యాదు చేశారు. ఆమె 1983లో భారతీయ పౌరసత్వం పొందార‌ని, అయితే 1980లోనే ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్ట్ తాజాగా ర‌ద్దు చేసింది. సోనియా పౌర‌స‌త్వంపై దాఖ‌లైన‌ ఫిర్యాదును మెజిస్ట్రేట్ తగిన కారణాలు చూపకుండానే కొట్టివేశారని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు కేసును తిరిగి మెజిస్ట్రేట్ కోర్టుకు రిమాండ్ చేసింది. ఈ తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా పడింది. పౌరసత్వ అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంటుందని గతంలో మెజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. దీనిని తప్పుపట్టిన సెషన్స్ కోర్టు, పౌరసత్వ వివాదంలోకి వెళ్లకుండా నేరపూరిత కోణంపై దృష్టి పెట్టాలని సూచించింది. మ‌రోవైపు ఈ ఫిర్యాదులో రాజ‌కీయ కోణం ఉంద‌ని, సోనియాపై దురుద్దేశంతోనే కొంద‌రు కావాల‌నే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాదులు ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>