Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం: ఉమర్ ఖలీద్‌కు బెయిల్

కలం, వెబ్‌ డెస్క్‌ : ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్‌యూ (JNU) మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌ (Umar Khalid)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

ఖలీద్ తల్లి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు త్వరలోనే ఒక సర్జరీ జరగనుంది. ఈ సమయంలో తల్లిని పరామర్శించడానికి, ఆమెకు అండగా ఉండడానికి వీలుగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో కోర్టు స్పందిస్తూ ఈ మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>