పొదుపు బాటలో ఢిల్లీ ప్రభుత్వం.. వర్క్ ఫ్రమ్ హోం, కాన్వాయ్‌పై కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా (Delhi Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపును పాటిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇది వర్తిస్తుంది. అలాగే ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను ఏకంగా 60 శాతం మేర తగ్గించుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తమ వాహనాల వినియోగాన్ని తగ్గించుకుని మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. అధికారుల ఇంధన కోటాలో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: ఏఐ ఎఫెక్ట్.. ఆ దేశంలో లేదు.. ఉద్యోగులకు నో టెన్షన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>