Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్పీజీ సరఫరా, పంటనష్టం, తిరుమల అంశాలపై సీఎం సమీక్ష

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై క్యాంపు ఆఫీస్ లో సీఎం చంద్రబాబు (Chandrababu) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబందించిన డేటాను సీఎంకు వివరించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని అన్నారు. దీనికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. శ్రీకాకుళం – కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్‌’ విధానాన్ని తీసుకురావాలని సూచించారు.

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దేవాలయ సంబంధిత అంశాలపై సోమవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ వినియోగించడంతో తిరుమలలో దర్శనాల సంఖ్య పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ సాయంతో తిరుమలలో క్యూలైన్లు, భక్తుల రద్దీ నిర్వహణ వల్ల నిరీక్షణ సమయం తగ్గిందని చెప్పారు. దీంతో 20 శాతం వరకు భక్తులు అదనంగా దర్శనాలు చేసుకునే అవకాశం లభించిందని స్పష్టం చేశారు. ప్రసాదం పవిత్రత, రుచి పెరగడం వల్ల శ్రీవారి భక్తుల్లో సంతృప్తి పెరిగిందని అన్నారు. అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా తిరుమల ప్రసాదాల్లో న్యూట్రీషినల్ విలువలు, పదార్ధాల క్వాలిటీ చెక్ చేస్తున్నామని చెప్పారు. దీంతో భవిష్యత్‌లో కల్తీకి ఆస్కారం ఉండదని సీఎం స్పష్టం చేశారు.

Read Also: ఉద్యోగులకు భారీ షాక్.. శాలరీ కటింగ్స్ కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>