కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కోయిలకొండ మండలం మల్లాపూర్ గ్రామంలోని విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యతో పాటు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మల్లాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు, డీసీసీ ఎగ్జిక్యూటివ్ మజర్ ఖాన్, గ్రామ పెద్దలు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్‌ని కలిసి వివరించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే డీసీసీ అధ్యక్షులు (DCC President) సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) స్పందించి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీసీ డిపోకు వెళ్లి డిపో మేనేజర్ అశోక్‌తో మాట్లాడారు. మల్లాపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని కోరడంతో, విద్యార్థులు, గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా గురువారం మల్లాపూర్ గ్రామానికి వెళ్లిన మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. మల్లాపూర్ గ్రామ ప్రజలు, విద్యార్థులు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తూ, తమ సమస్యను వెంటనే పరిష్కరించి బస్సు సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిట్టెం అభిజిత్ రెడ్డి , కోయిల్‌కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్ , మల్లాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మల్లాపూర్ గ్రామ పెద్దలు, డీసీసీ ఎగ్జిక్యూటివ్ మజర్ ఖాన్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎండీ కలీం, కాంగ్రెస్ నాయకులు బూరేమోని చందు యాదవ్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

