కలం, కరీంనగర్ బ్యూరో: దళితుల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally) అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్పీ సెల్ చైర్మన్ అయిన సందర్భంగా తొలిసారి ఆయన కరీంనగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా కవ్వంపల్లికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి మానకొండూర్ మండలం అల్గునూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాం నుంచే కాంగ్రెస్ పార్టీ ఎస్సీల సంక్షేమానికి పాటుపడుతూ వస్తోందన్నారు.
దళితులకు, పేదలకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి (MLA Kavvampally అన్నారు. ఇందిరా ఆశయాలను కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా ఎస్సీలకు, పార్టీకి మరింత సేవ చేసే అవకాశం లభించిందని కవ్వంపల్లి అన్నారు. ఇందుకు సహకరించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Also: సమాజంలో నాదీ డాక్టర్ లాంటి పాత్రే.. సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


