కలం, వెబ్ డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కి దక్షిణాఫ్రికా తన జట్టును ప్రకటించింది. ఇందులో ఓట్నీల్ బార్ట్మన్‌కు స్థానం దక్కలేదు. వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా బార్ట్‌మన్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోకపోవడాన్ని దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) తప్పుబట్టారు. బార్ట్‌మన్‌కు చోటు దక్కకపోవం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. 2024 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ప్రొటీస్ జట్టులో కీలక పాత్ర పోషించిన బార్ట్‌మన్‌ను ఈసారి పక్కన పెట్టడం న్యాయంగా అనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా సెలక్టర్లు కగిసో రబడా, లుంగి ఎన్‌గిడీ, మార్కో జాన్సెన్, అన్రిచ్ నోర్ట్జే, కార్బిన్ బోష్, టీనేజ్ లెఫ్ట్ ఆర్మర్ క్వేనా మఫాకాను జట్టులోకి తీసుకుంది.
అయితే ఇటీవలే ఎంఐ కేప్‌టౌన్‌పై పర్ల్ రాయల్స్ తరఫున మ్యాచ్ తిప్పేసిన బార్ట్‌మన్ ప్రదర్శన మళ్లీ ఈ నిర్ణయంపై చర్చకు తెరలేపింది. తన సహచరుడికి అన్యాయం జరిగిందన్న భావనతో కెప్టెన్ డేవిడ్ మిల్లర్ కూడా స్పందించాడు. ఎంపిక దక్కకపోయినా నిరాశకు లోనుకాకుండా ప్రొఫెషనల్‌గా ముందుకు సాగుతున్న బార్ట్‌మన్ తీరును అతడు హృదయపూర్వకంగా ప్రశంసించాడు Dale Steyn.


