కలం, కరీంనగర్ బ్యూరో: పోస్టల్ సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, వినతులను పరిష్కరించేందుకు జూన్ 17న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ (Dak Adalat) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ ఎస్పీ కె. సైదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఇది పూర్తిగా ఆన్‌లైన్ (వర్చువల్ మోడ్) ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను “54th Dak Adalat” అని కవర్‌పై స్పష్టంగా రాసి, జూన్ 5వ తేదీలోపు కె. శ్రీకాంత్ సహాయ డైరెక్టర్ (స్టాఫ్ & విజిలెన్స్), పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయం, హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్ – 500001 అనే చిరునామాకు పంపించాలని పేర్కొన్నారు. సిబ్బంది వ్యవహారాలు, సర్వీస్ సంబంధిత అంశాలు, కోర్ట్ పెండింగ్‌లో ఉన్న కేసులను డాక్ అదాలత్‌లో పరిగణించబోమని వివరించారు.
Read Also: మహిళా సాధికారత వారోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
Read Also: ఆమెకు రక్షణేది..?

