కలం, వెబ్‌డెస్క్: వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Traffic Police) స్పెషల్ డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా వాహనాలను పట్టుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 315 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలలో 268 బైకులు, 28 కార్లు, 15 ఆటోలు, 4 హెవీ వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వీరందరిని చట్టపరంగా కోర్టులో హాజరు పర్చనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి ప్రమాదానికి కారణమైతే సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతవారంలో మొత్తం 120 డ్రంగ్ & డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్న వారిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి వాహనదారులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: నరసింహ స్వామికే శఠగోపం.. యాదాద్రి ఆలయ ఆదాయానికి గండి!
Follow Us On: Instagram

