Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC JAC Strike)కు కౌంట్ డౌన్ మొదలయింది. రెండ్రోజుల్లో (48 గంటల్లో) కార్మికులు సమ్మె సైరన్ ను మోగించనున్నారు. అయితే కార్మికుల సమ్మెను ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. మరోవైపు ప్రభుత్వంలో విలీనం, యూనియాన్ల పునరుద్ధరణ మినహా అన్ని డిమాండ్ లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని చెబుతోంది. కార్మికుల మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అన్ని డిపోలను సమ్మెకు ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధం చేశారు.

ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే.. కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రజా రవాణా అతలాకుతలం కానుంది. అటు సమ్మె (RTC JAC Strike) అనివార్యం అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అద్దె బస్సులతో పాటు స్కూల్ బస్సులను సైతం వినియోగించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది.

Read Also: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>