బీఆర్ఎస్‌లో కొత్త జోష్‌.. మే 6న మ‌రో భారీ స‌భ‌కు ప్లాన్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో కొత్త‌ ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. నేడు జ‌గిత్యాల‌లో నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ పార్టీ నేత‌ల‌కు బూస్టింగ్‌గా మార‌నుంది. అధికార పార్టీ నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ బీఆర్ఎస్‌లో చేరుతుండ‌టంతో పార్టీ శ్రేణుల్లో మ‌రింత జోష్ నెల‌కొంది. చాలా రోజుల త‌ర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నారు. దీంతో జ‌గిత్యాల స‌భ‌ స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇదే ఉత్సాహంలో బీఆర్ఎస్ మ‌రో ముఖ్య‌మైన బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌రంగ‌ల్‌ (Warangal)లో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ రైతు డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన చోట బీఆర్ఎస్ (BRS Party) భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. మే మొద‌టి వారంలో ఈ స‌భ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. మే 6వ తేదీని స‌భ ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ స‌భ‌కు కూడా కేసీఆర్ వ‌స్తారా? లేదా అన్న‌దానిపైనా ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇదే ఊపులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే ఛాన్స్ ఉంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

Read Also: నల్గొండ జిల్లాలో ‘డెవిల్’ ఫిష్ కలకలం.. మత్స్యకారులు ఆందోళన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>