రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: కూచాడి శ్రీహరి

కలం, నిర్మల్: ఢిల్లీలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన (Congress Protest) చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై గళమెత్తే హక్కు ప్రతి నాయకుడికీ ఉందని, అలాంటి స్వరాలను అణచి వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>