తెలంగాణ ఈ-గవర్నెన్స్ విధానాన్ని వివరించిన సీఎస్ రామకృష్ణారావు

కలం, వెబ్ డెస్క్: ఈ-గవర్నేన్స్ పై కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రెటరీ డాక్టర్ టివి సోమనాథన్ (T. V. Somanathan) ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నేన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను సోమనాథన్ ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న simplegov ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలలో ఉన్న నిబంధనల మేరకు సేవలను అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao).. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ (E-Governance Model) విధానాన్ని వివరించారు.

ప్రజలకు పాదర్శకంగా సులభతరమైన పౌర సేవలను అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్ లైన్ లో డ్యాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. అలాగే మున్సిపల్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, రెవెన్యూ తదితర శాఖల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ మేరకు రామకృష్ణారావును ఈ-గవర్నెన్స్ విధానంపై కేబినెట్ సెక్రెటరీ సీఎస్ అభినందించారు. ఈ మీటింగ్ లో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ముఖ్యకార్యదర్శి యోగితారాణా, షీకాగోయల్, సెక్రెటరీలు రఘునందన్ రావు, శ్రీధర్, అనితా రామచంద్రన్, హౌసింగ్ ఎండీ వి.పి. గౌతం, సెర్పు సిఇఒ దివ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>