కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఓ మొసలి కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వట్పల్లి మండలం కెరూరు గ్రామస్తులు కంసన్పల్లి మధ్య రోడ్డు మార్గంలో తిరుగాడటం చూసి షాకయ్యారు. మంజీర సమీపంలోని సరస్సును తన నివాసంగా మార్చుకున్న మొసలి, నీటిలో నుంచి బయటకొచ్చి రోడ్డుపై తిరిగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. గ్రామస్తులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా అటవీ అధికారి సీహెచ్ శ్రీధర్ రావు ఆదేశాల మేరకు.. ఒక బృందం గ్రామానికి చేరుకున్నారు.
దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. తర్వాత దానిని సింగూర్ సమీపంలోని మంజీరా నదిలోకి వదిలారు. నివాసాల దగ్గర మొసళ్ళు లేదా ఏదైనా అడవి జంతువులను చూసినట్లయితే అటవీ సిబ్బందికి తెలియజేయాలని అధికారులను గ్రామస్తులను కోరారు. వెంటనే రక్షించి తగిన ఆవాసాలలో వదిలివేస్తామన్నారు. అధికారులు వెంటనే స్పందించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Sangareddy | ఈ నదిలో దాదాపు 560 పైచిలుకు మొసళ్లు ఉన్నట్లు సమాచారం. మంజీరా నదీలో తరచుగా మొసళ్లు సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు భయాందోళనకు గురువుతున్నారు. తీరం ప్రాంతం చుట్టూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: ఖమ్మం జిల్లాలో వన్యప్రాణుల వేట.. సూత్రదారి మాజీ ఎమ్మెల్యే బంధువేనా?
Follow Us On: Youtube


