పెళ్లి చేసుకున్న రొనాల్డో.. స్పెష‌ల్ ఫోటోతో పోస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) పెళ్లి చేసుకున్నారు. త‌న చిర‌కాల ప్రేయ‌సి జార్జినా రోడ్రిగెజ్‌ (Georgina Rodriguez)తో క‌లిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన‌ట్లు రొనాల్డో త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. పోర్చుగల్‌లోని కాస్కైస్ రిసార్ట్ నగరంలో ఈ వివాహ వేడుక జ‌రిగింది. రొనాల్డో, జార్జినా దాదాపు ప‌దేళ్ల‌కు పైగా రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు. వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. వీరికి ఐదుగురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంగరాలు పెట్టుకున్న‌ ఫోటోలను షేర్ చేసుకుంటూ రొనాల్డో ఈ పెళ్లిని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ పెళ్లికి రొనాల్డో, జార్జినాల‌ పిల్లలు ఐదుగురు హాజరయ్యారు.

2016లో మేడ్రిడ్‌లోని ఒక గూగుల్ స్టోర్‌లో పని చేస్తున్న సమయంలో వీరు మొదటిసారి కలుసుకున్నారు. గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వివాహ వేడుకతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు రొనాల్డో జంట‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>