‘ఖేలో ఇండియా’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: సీఎం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (2026 (Khelo India Youth Games 2026) పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ (CM Revanth) అధికారులను ఆదేశించారు. నేషనల్ లెవెల్ లో నిర్వహించనున్న పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్న తరుణంలో ఇందుకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ మేరకు ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పోటీల ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని స్టేడియంల పరిస్థితిని పరిశీలించాలని.. వెంటనే వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు ఇప్పటినుంచే పనులు వేగవంతం చేయాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>