అమెరికాలో కాల్పులు.. నలుగురు స్పాట్ డెడ్

కలం, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని లోగన్ సర్కిల్ వద్ద ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు సిటీ పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు వివరించారు. కాల్పులు జరిగిన ప్రాంతం వైట్ హౌస్‌కు కొద్ది దూరంలోనే ఉండటంతో సెక్యూరిటీ మరింత అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా మీడియా పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>