కండక్టర్‌ను బస్సులో నుంచి నెట్టిన మహిళ అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో ఆర్టీసీ కండక్టర్‌ను కదులుతున్న బస్సులో నుంచి కిందకు నెట్టివేసిన మహిళను అశ్వాపురం పోలీసులు (Aswapuram Police) సోమవారం అరెస్ట్ చేశారు. ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య టికెట్ తీసుకునే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం తారస్థాయికి చేరడంతో బస్సు మిట్టగూడెం సమీపానికి రాగానే సదరు మహిళ తీవ్ర ఆగ్రహంతో కండక్టర్‌ను బస్సులో నుంచి బయటకు నెట్టివేసింది. దీంతో కండక్టర్ రోడ్డుపై పడిపోగా, అదే బస్సు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితురాలైన మిట్టగూడెంకు చెందిన బానోత్ మౌనికను సోమవారం అరెస్ట్ చేసి మణుగూరు కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజా రవాణాలో సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>