ఉపాధి హామీపై బీజేపీకి సీపీఎం వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, కోట్లాదిమంది పేద ప్రజల ఉపాధి దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. సీపీఎం నేతలు సంగారెడ్డి(Sangareddy) జిల్లా చౌటకూరు మండలం లింగంపల్లి (Lingampalli) గ్రామంలో ఉపాధి హామీ పనులను, కూలీల్లో వస్తున్న సమస్యలపై పర్యటించారు. “ఉపాధి హామీ పథకాన్ని” రక్షించుకునేందుకు ఊరూర ఉద్యమం చేపడతామని, ఉపాధి కూలీల పొట్ట కొట్టే వీబీ జీ రామ్‌ జీ (VB-GRAMG) పథకాన్ని రద్దు చేయాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు(Chukka Ramulu) అన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ (BJP) ప్రభుత్వం కుట్ర చేస్తుందని..  ఇప్పటికే ఉపాధి హామీపై కుంటి సాకులు చెప్తూ నిధుల్లో కోతలు విధిస్తున్నారని, అనేక మంది జాబ్‌కార్డులు తొలగింపు చేశారని అన్నారు. ఉపాధి హామీ పనులకు కూలీలకు చెల్లించే నిధులను ఎవరు చెల్లించాలనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలకి లబ్ది చేకూరుస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని రాములు(Chukka Ramulu) అన్నారు.

Read Also: పేదల ఇండ్లు కూల్చడం మా ఉద్దేశం కాదు : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>