ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

కలం, వరంగల్ బ్యూరో : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, సమ్మె (TGSRTC Strike) పై మొండి వైఖరి వీడీ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని కాళోజి సెంటర్ లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె (TGSRTC Strike)కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన రెండు వేతన సవరణలను తక్షణమే అమలు చేయాల‌న్నారు. కార్మికుల ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన సాధ్యం అని, సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రైవేటు డ్రైవర్ల ప్రయోగం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని, సమ్మెను అణచివేసేందుకు ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని హిత‌వు ప‌లికారు.

ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రెషియో ఇవ్వాలని శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్ఎ స్టాలిన్, వుట్కూరి రాములు, కర్రే లక్ష్మణ్, ఎదునూరి వెంకట్రాజం, కొట్టేపాక రవి, వేల్పుల సారంగపాణి, గుంటీ రాజేందర్, అలువాల రాజు, పొనుగోటి రామ్ గోపాల్ చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, మామునూరి దామోదర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>