Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలి : సీపీఐ, బీఆర్ఎస్ నేతలు

కలం, ఖమ్మం బ్యూరో : విద్యుత్ రంగంలో పని చేస్తున్న ఆర్టీజన్ కార్మికులకు తక్షణమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఏపీఎస్ఈబీ) రూల్స్ అమలు చేయాలని సీపీఐ, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీజన్స్ సమ్మెలో భాగంగా పాల్వంచ (Palwancha) కేటీపీఎస్ (KTPS) ప్లాంట్ ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని శుక్రవారం సీపీఐ, బీఆర్ఎస్ నేతలు సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికులకు రెండు వేర్వేరు సర్వీస్ రూల్స్ ఉండటం అన్యాయమన్నారు. ఆర్టీజన్ కార్మికులను రెండో శ్రేణి ఉద్యోగులుగా చూడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

వారు నిత్యం బొగ్గు, బూడిద మధ్యలో పని చేస్తూ అనారోగ్యం పాలవుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2026 వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్హతను బట్టి ఆర్టీజన్లను వెంటనే కన్వర్షన్ చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సమస్యలు తీరే వరకు ఆర్టీజన్ల పోరాటానికి పూర్తి మద్దతుగా ఉంటామని సీపీఐ, బీఆర్ఎస్ నేతలు కార్మికులకు భరోసా కల్పించారు. సంఘీభావం ప్రకటించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>