కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాకు సంబంధించి వారానికో అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. రామ్ స్వయంగా డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ డిసైడ్ కాలేదు. కానీ, RAPO23 అనే స్క్రీన్ టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన సంయుక్తా మీనన్ నటించనుందని ఇటీవల మూవీ టీం ప్రకటించింది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్ (Jackie Shroff) రామ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. రామ్ పోతినేని ఈ చిత్రాన్ని ఒక ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూడని స్పెషల్ సినిమాటిక్ అనుభూతిని అందించేలా కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక అధికారికంగా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.

