సీఎం కావడానికి ఆయనే స్ఫూర్తి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ కవి అందె శ్రీ రాసిన గీతాలే తాను సీఎం కావడానికి ఎంతో స్ఫూర్తి కలిగించాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  అన్నారు. లక్షలాది మందిని ఉద్యమకారులుగా మార్చిన శక్తి ఆయన పాటకు ఉందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్వరం బలంగా నిలబడిందన్నారు. దొరలు తమ అహంకారంతో అందె శ్రీ పాటను నిర్బంధించారని గుర్తు చేశారు.

ఆ పాటే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గీతమైందన్నారు. ఆత్మగౌరవం ఉన్న అందె శ్రీ ఏనాడూ దొరల ముందుకు తలవంచలేదన్నారు. అర్ధాకలితో ఉన్నా.. గడీల ముందు మోకరిల్లలేదన్నారు. గద్దర్ కు అవమానం జరిగిన నాడే.. తెలంగాణ సమాజం నిర్ణయించుకుందన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు..

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ముసుగు వేసుకుని వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీలుగా ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ, వినోద్ కుమార్‌కు ప్లానింగ్ వైస్ ఛైర్మన్ పదవులు వెంటనే ఇచ్చుకున్నాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. పదవులు పోయిన వెంటనే ఆయన చుట్టాలు, కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నాడని.. కానీ, నిరుద్యోగులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

అప్పటికే పదేళ్ల పాటు కోచింగులు తీసుకుని, అప్పులు చేసి నిరుద్యోగులు ఎంత గోస పడ్డారో.. అని గుర్తు చేశారు. కానీ, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. ఉద్యోగాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>