పైపులైన్ గుంతలోకి దూసుకెళ్లిన కారు.. భార్యభర్తలకు తీవ్ర గాయాలు

కలం, వెబ్ డెస్క్ : కారు అదుపుతప్పి పైపులైన్ గుంతలోకి దూసుకెళ్లిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రామారెడ్డి మండలం రంగంపేట రైల్వే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ గుంతలో కారు పడిపోవడంతో కారులో ఉన్న భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గుంతలో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు.

అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి (Kamareddy) కి చెందిన మొగుళ్ల వనిత, రమేష్ గౌడ్ గా దంపతులు కారులో వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది. గుంత లోతుగా ఉండడంతో ఎవరికీ కనిపించలేదు. కేకలు విన్న రైల్వే సిబ్బంది అతికష్టం మీద దంపతులిద్దరిని బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>