రాత్రి ఏకాంతంగా ఉన్న జంటపై దాడి.. యువతితో అసభ్య ప్రవర్తన

కలం, వెబ్ డెస్క్: రాత్రి సమయంలో ఏకాంతంగా ఉన్న జంటపై కొందరు వ్యక్తులు దాడికి దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ లో గత రాత్రి ఓ యువతీయువకుడు (Couple Attack) ఏకాంతంగా సమయంలో కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో జంట సరదాగా గడుపుతుండగా.. ఇదే ఛాన్స్ గా భావించిన అక్కడి వ్యక్తులు అటాక్ చేశారు. యువకుడిని వాగ్వాదం జరుగుతుండగా.. సదరు యువతి ఆ దుండగులను ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే యువతిపై సైతం వారు దాడికి దిగారు. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ పై అనుచిత ప్రవర్తనతో ఎత్తేశారు. ఇందుకు  సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

యువతీయువకులు ఏకాంతంగా గడుపుతున్నా, అనుచితమని భావించే పని ఏదైనా చేస్తున్నా.. అది వారి వ్యక్తిగత విషయమని.. వారిపై దాడి చేయడం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుగుతున్నారు. సదరు యువతి పట్ల దురుసుగా ప్రవర్తించే హక్కు ఆ దుండగులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకూ ఇలాంటి పరిస్థితి రాకుండా యంత్రాంగం ఆ దుండగులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>