Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్ మ్యాచ్‌పై కౌంట్‌డౌన్.. పీఎంతో పాక్ టీమ్ భేటీ..

కలం, డెస్క్ : వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ అంశంలో కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్–A మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం మద్దతుతో పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకటనతో అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ పరిణామాల మధ్య పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ (Mohsin Naqvi) నేడు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలవనున్నారు. ఈ భేటీ తర్వాతే భారత్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా అనే ఫైనల్ కాల్ తీసుకునే అవకాశం ఉంది. సోమవారం డెడ్‌లైన్‌గా మారింది.

పరిస్థితి చేయి దాటుతుండటంతో ఐసీసీ నేరుగా రంగంలోకి దిగింది. ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా సహా ఇద్దరు సభ్యులతో కూడిన బృందం లాహోర్‌లో పీసీబీతో చర్చలు జరిపింది. మ్యాచ్ బహిష్కరణపై పునరాలోచించాలని ఐసీసీ కోరినట్లు సమాచారం. షెడ్యూల్ బాధ్యతలు నెరవేర్చకపోతే శిక్షలు, ఆర్థిక నష్టాలు తప్పవన్న హెచ్చరిక కూడా ఇచ్చినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలోనే తీసుకోవాలని పీసీబీ స్పష్టం చేసింది. అందుకే నక్వీ–షరీఫ్ భేటీ కీలకంగా మారింది.

ఇదిలా ఉండగా, టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ (Pakistan) జట్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ భారత్ మ్యాచ్‌పై ఉన్న బహిష్కరణ మేఘం ఇంకా తొలగలేదు. ఈ అనిశ్చితి శ్రీలంకకు కూడా తలనొప్పిగా మారింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌తో భారీ ఆదాయం ఆశించారు. టికెట్ డిమాండ్‌, పర్యాటక రద్దీతో ఆర్థిక లాభం ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

మ్యాచ్ జరగకపోతే ప్రసార సంస్థలు, ఇతర భాగస్వాములకు కూడా నష్టం తప్పదని శ్రీలంక క్రికెట్ అభిప్రాయపడినట్లు సమాచారం. టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ రెండూ విజయాలతోనే ఆరంభించాయి. భారత్ యూఎస్ఏపై గెలిచింది. పాకిస్థాన్ నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం ఒక్క ప్రశ్నపైనే నిలిచింది. నేడు తీసుకునే నిర్ణయం టీ20 వరల్డ్ కప్ దిశను ఎలా మలుస్తుందన్నదే సమాధానం కావాల్సి ఉంది.

Read Also: డిజిటల్​ అరెస్ట్​ మోసాల్లో ఆ అధికారుల కుట్ర : సుప్రీం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>